IND vs SA: ధోనీ, కోహ్లీ వల్ల కానిది.. రోహిత్ సాధించాడు!

-

IND vs SA : నిన్న సఫారీలతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా 16 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. సఫారీల ముందు 238 పరుగుల లక్ష్యం ఉంచిన టీం ఇండియా… ఆ టీం ను కట్టడి చేయగలిగింది. సౌత్ ఆఫ్రికా మిడిల్ అండ్ బ్యాట్స్మెన్లు.. దాటిగా ఆడినప్పటికీ చివరికి టీం ఇండియా నే విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్ లో వేగంగా రెండు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా ను దెబ్బ కొట్టాడు. దీంతో 2-0 తేడాతో సిరీస్‌ ను గెలిచింది రోహిత్‌ సేన. ఈ నేపథ్యంలోనే కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

2015 నుంచి ఇప్పటి వరకూ నాలుగు సార్లు సౌతాఫ్రికా జట్టు ఇండియా గడ్డ మీద టీ 20 సిరీస్‌ లు ఆడగా.. తొలిసారి సిరీస్‌ కోల్పోయిన ఇండియా, ఆ తర్వాత రెండు సార్లు మాత్రం సిరీస్‌ ను డ్రాగా ముగించుకుంది. ధోని, కోహ్లీ, పంత్‌ కెప్టెన్సీలో సొంత గడ్డ పై సౌతాప్రీకా పై టీ 20 సిరీస్‌ గెలవలేకపోయిన టీమిండియా… రోహిత్‌ నాయకత్వంలో సిరీస్‌ ను గెలిచింది. దీంతో రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news