టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు 47 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అతను కరోనా నేపధ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నాడు. ఈ తరుణంలో కరోనా యోధులకు గౌరవంగా పుట్టిన రోజు జరుపుకోవాలి అని భావించాడు. తన తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకున్న బ్యాటింగ్ మ్యాస్ట్రో తన తల్లి నుంచి గణేశుడి ఫోటో తీసుకున్నట్టు చెప్పాడు.
“నా తల్లి నుండి ఆశీర్వాదం తీసుకొని నా రోజును ప్రారంభించాను. ఆమె నాకు బహుమతిగా గణపతి బప్పా ఫోటోను ఇచ్చారు. ఇది అమూల్యమైనది అంటూ ఆయన ట్వీట్ చేసాడు. అంతకు ముందు సచిన్ కి సంబంధించి కీలక విషయం బయటకు వచ్చింది. “ఇది వేడుకలకు సమయం కాదని సచిన్ నిర్ణయించారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, పోలీసులు, రక్షణ సిబ్బంది,
అందరికీ తాను ఇవ్వగల ఉత్తమ నివాళి ఇదే అని ఆయన భావిస్తున్నారని సచిన్ సన్నిహిత ఆటగాడు ఒకరు మీడియాకు వివరించారు. తన 47 వ పుట్టినరోజు సందర్భంగా, టెండూల్కర్ తన మాజీ సహచరులు మరియు ప్రస్తుత భారత ఆటగాళ్ళు సచిన్ కి శుభాకాంక్షలు చెప్పారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెండూల్కర్ మాజీ ఓపెనింగ్ పార్టనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా మాస్టర్ బ్లాస్టర్ కు శుభాకాంక్షలు చెప్పారు.
Started my day by taking blessings from my Mother. ??Sharing a photo of Ganpati Bappa that she gifted me.
Absolutely priceless. pic.twitter.com/3hybOR2w4d— Sachin Tendulkar (@sachin_rt) April 24, 2020