రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడుతున్న జమ్మూ కాశ్మీర్ కు చెందిన అమీర్ పై లెజెండరీ క్రికెట్ సచిన్ ప్రశంసలు కురిపించారు. “అమిర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆటపట్ల అతని ప్రేమ, అంకిత భావం నా గుండెను తాకింది. క్రీడల పట్ల మక్కువ ఉన్న లక్షలాది మందిని ప్రేరేపించడం అద్భుతం. నేను ఏదో ఒక రోజు అతడిని కలుస్తాను. అతని పేరుతో ఉన్న ఒక జెర్సీని తీసుకుంటా” అని ట్వీట్ చేశారు.
ఇది ఇలా ఉండగా, జమ్మూ కాశ్మీర్ కు చెందిన అమిర్ హుస్సేన్ ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు. కానీ క్రికెట్ ఆడాలనే తన కలను మాత్రం వదులుకోలేదు. మెడ, భుజం సాయం తో బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్… కాలి తో బౌలింగ్ చేస్తున్నాడు. అతడి పట్టుదల చూసి అందరూ రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు.