Amir Hussain Lone: రెండు చేతులు లేకున్నా.. క్రికెట్‌లో సత్తా చాటుతోన్న అమీర్‌

-

క్రికెట్‌ చాలా మంది ఆడతారు. క్రికెట్‌ ఆడటానికి మంచి ఫిట్‌ నెస్‌ ఉండాలి. లేకపోతే.. క్రికెట్‌ ఆడలేము. అయితే… ఓ వ్యక్తి రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన అమిర్ హుస్సేన్ ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు.

Jammu & Kashmir para cricket captain Amir Hussain Lone’s inspirational journey

కానీ క్రికెట్ ఆడాలనే తన కలను మాత్రం వదులుకోలేదు. మెడ, భుజం సాయంతో బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్… కాలితో బౌలింగ్ చేస్తున్నాడు. అతడి పట్టుదల చూసి అందరూ రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు. అయితే… రెండు చేతులు లేకపోయినా క్రికెట్ ఆడుతున్న జమ్మూ కాశ్మీర్ కు చెందిన అమీర్ పై లెజెండరీ క్రికెట్ సచిన్ ప్రశంసలు కురిపించారు. “అమిర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆటపట్ల అతని ప్రేమ, అంకిత భావం నా గుండెను తాకింది. క్రీడల పట్ల మక్కువ ఉన్న లక్షలాది మందిని ప్రేరేపించడం అద్భుతం. నేను ఏదో ఒక రోజు అతడిని కలుస్తాను. అతని పేరుతో ఉన్న ఒక జెర్సీని తీసుకుంటా” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news