Sanju Samson: టీమిండియా కెప్టెన్ గా సంజూ శాంసన్‌ ?

-

Sanju Samson: టీమిండియా కెప్టెన్ గా సంజూ శాంసన్‌ వ్యవహరించనున్నాడా? అంటే అవుననే అంటున్నారు టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌. నిన్న ముంబైపై రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

Sanju Samson as captain team india

అయితే ఈ తరుణంలోనే… ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్, ఓపెనర్ జైస్వాల్ పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. యశస్వి ఆటే అందుకు నిదర్శనం. టీ20 వరల్డ్ కప్ లో కీపర్ ఎవరన్న దానిపై ఇక చర్చ అనవసరం. శాంసన్ నే ఎంపిక చేయాలి. రోహిత్ తర్వాత కెప్టెన్ గా అతడిని ప్రోత్సహించాలి’ అని అభిప్రాయపడ్డారు టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌.

Read more RELATED
Recommended to you

Latest news