20-20 క్రికెట్లో క‌ళ్లుచెదిరే రికార్డులు… ఒకే మ్యాచ్‌లో ప‌లు రికార్డులు బ్రేక్‌

-

20-20 క్రికెట్లో ప‌సికూన‌లు కూడా రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్నాయి. రెండు రోజుల క్రితం జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో అప్గ‌న్ ఆటగాళ్లు 7 వ‌రుస బంతుల్లో 7 సిక్సులు బాది రికార్డుల మోత మోగించారు. చాలా చిన్న చిన్న దేశాలు సైతం 20 క్రికెట్‌కు వచ్చేస‌రికి విధ్వంసం క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే నెదర్లాండ్‌తో ముక్కోణ‌పు సీరిస్‌లో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓపెనర్‌ హెన్రీ జార్జ్‌ మున్సే టి20 క్రికెట్‌లో రికార్డులతో అదరగొట్టాడు. కేవ‌లం 41 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు.

అంతర్జాతీయ టి20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. 56 బంతుల్లో 127 పరుగులు చేసిన మున్సే 14 సిక్స‌ర్లు, 5 ఫోర్లు కొట్టాడు. మున్సేతో పాటు కెప్టెన్‌ కోయిట్జర్‌ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. వీరిద్ద‌రి వీర ఉతుకుడుతో స్కాట్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇక 41 బంతుల్లో సెంచ‌రీ చేసిన మున్సే ఫాస్టెస్ట్‌ సెంచరీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా), రోహిత్‌ శర్మ (భారత్‌), సుదేశ్‌ విక్రమశేఖర (చెక్‌ రిపబ్లిక్‌) 35 బంతుల్లోనే సెంచరీ సాధించి తొలి జాబితాలో ఉన్నారు. ఇక 14 సిక్స‌ర్లు కొట్టిన మున్సే ఒకే ఇన్సింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన జాబితాలో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.   గతంలో హజ్రతుల్లా జజాయ్‌ (అఫ్గానిస్తాన్‌) 16 సిక్సర్లు కొట్టగా… ఫించ్‌ కూడా 14 సిక్సర్లు బాదాడు.  ఇక యువ‌రాజ్ (36) త‌ర్వాత ఒకే ఇన్సింగ్స్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో 32 ప‌రుగులతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news