కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్ ఎంపీ బరిలో సానియా మీర్జా..!

-

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని వ్యుహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచూతూచీ వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో సీరియస్ గా వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణలు, కరిష్మా, అంగ బలం, అర్థబలం ఉన్న గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని చూస్తోంది. ఇందులో భాగంగా, హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అనూహ్యంగా తెరపైకి కొత్త వ్యక్తిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని మహిళను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ సైతం ఓవైసీకి ధీటైనా అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. మొదట టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఏఐసీసీ పరిశీలించగా.. ఆయన మాత్రం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును ప్రతిపాదించారని సమాచారం. అధిష్టానం కూడా సానియా మీర్జా పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెన్సిస్ స్టార్ ప్లేయర్ దేశవ్యాప్తంగా సానియా మీర్జా క్రేజ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news