టీమిండియాకు షాక్.. వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీపై నిషేధం?

-

బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో షమీ బౌలింగ్ చేస్తున్న సమయంలో… బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ ప్యాడ్స్‌ను తాకింది. అయితే.. దానిపై ఎంపైర్ మరియాస్ ఏం స్పందించలేదు. దీంతో కోహ్లీ ఆయనతో వాగ్వాదానికి దిగాడు.

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భారత్ దుందుడుకు మీద ఉంది. సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టబోతోంది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలన్న కసితో ఉంది. అయితే.. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఊహించని షాక్ తగలనుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నిషేధం విధించే అవకాశం ఉందట.

అయితే.. ఈ నిషేధం.. వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్‌కే పరిమితమట. కాకపోతే అది ఏ మ్యాచ్ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ నిషేధం వెంటనే అమలు చేయాలని బీసీసీఐ కోరుతోందట. ఐసీసీకి కూడా బీసీసీఐ లేఖ రాయబోతుందట. సెమీ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఈ నిషేధం అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

విరాట్ కోహ్లీపై ఎందుకు నిషేధం విధించబోతున్నారంటే.. లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరిగిన సందర్భంగా కోహ్లీ అంపైర్‌తో గొడవ పెట్టుకున్నాడు. అదే విరాట్ కోహ్లీ నిషేధానికి కారణం కానుంది.

బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో షమీ బౌలింగ్ చేస్తున్న సమయంలో… బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ ప్యాడ్స్‌ను తాకింది. అయితే.. దానిపై ఎంపైర్ మరియాస్ ఏం స్పందించలేదు. దీంతో కోహ్లీ ఆయనతో వాగ్వాదానికి దిగాడు. దానికి అంపైర్లు ఆగ్రహానికి గురయి.. కోహ్లీకి ఓ మ్యాచ్ నిషేధం విధించాలని సిఫారసు చేశారు. అయితే.. విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగడం ఇదే కొత్తేమీ కాదు. అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆయన అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

అంపైర్లతో దురుసుగా ప్రవర్తించడం ఆర్టికల్ 2.1 ప్రకారం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమట. అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ దురుసుగా ప్రవర్తించడం వల్ల కోహ్లీకి దక్కాల్సిన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారట. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా దురుసుగా ప్రవర్తించడంతో ఒక మ్యాచ్‌లో నిషేధం విధించనున్నారు.

ఒకవేళ విరాట్ కోహ్లీకి ఒక మ్యాచ్ నిషేధం విధిస్తే.. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లోనే అయ్యే అవకాశం ఉంది. శ్రీలంకతో టీమిండియాకు చివరి లీగ్ మ్యాచ్ ఉంది. ఈ శనివారమే శ్రీలంకతో భారత్ మ్యాచ్ ఆడనుంది. అయితే.. కోహ్లీతో విధించే నిషేధం ఏదో.. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లోనే అమలు చేయాలని బీసీసీఐ.. ఐసీసీని కోరనుందట. భారత్ ప్రస్తుతం ఎలాగూ సెమీ ఫైనల్‌కు చేరుకుంది కాబట్టి.. శ్రీలంకతో జరిగే మ్యాచ్ ఓడిపోయినా పెద్ద నష్టమేమీ ఉండదు. సెమీ ఫైనల్‌లో కోహ్లీ లేకపోతే.. బ్యాటింగ్ లైనప్‌కు సమస్య వచ్చే కకావికలం అయ్యే అవకాశం ఉందని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version