Singapore open: సంచలన విజయంతో ఓపెన్ క్వార్టర్స్ లోకి సైనా

-

గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ఫ్రీ క్వార్టర్స్ లో సంచలన విజయంతో సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్ కి దూసుకెళ్లింది సైనా నెహ్వాల్. తుయ్ లిన్ గుయెన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1 తేడాతో పీవీ సింధు కష్టపడి గెలిచింది. సింధు – 19-21, 21-19, 21-18 తో హుయ్ లిన్(వియత్నాం)పై గెలిచింది. సైనా -21-19,11-21,21-17 తో రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ కౌన్సిల్ పతక విజేత అయిన ఐదో సీడ్ హి బెంగ్జియావో(చైనా)పై విజయకేతనం ఎగురవేసింది.

15 నెలల తర్వాత తొలిసారి ఓ టోర్నీ క్వార్టర్స్ కి చేరుకుంది సైనా. అస్మిత – 9-21,13-21 తో హన్ యు చేతిలో పరాభవం చవిచూసింది. ఇక పురుషుల విభాగానికి వస్తే.. మిథున్ -10-21,21-18,21-16 తో ఎంఘాట్(ఐర్లాండ్) చేతిలో ఓటమి చవి చూశాడు. ప్రణయ్ -14-21,21-20,21-18 తో చో టిన్ చెన్ పై విజయం సాధించాడు. డబుల్స్ లో అర్జున్ ద్రూవ్ కపిల-18-21,24-22,21-18 తో గో జి ఫి నూర్ ఇజాజుద్దిన్ పై గెలిచి కోటర్స్ లోకి ప్రవేశించాడు.

Read more RELATED
Recommended to you

Latest news