‘ఫేక్’ సర్వే: ఏది నిజం?

-

తెలంగాణ రాజకీయాల్లో వరుసపెట్టి సర్వేలు బయటకొస్తున్నాయి..ఒకో సర్వేలో ఒకో ఫలితం ఉంటుంది..అసలు వీటిల్లో ఏది నిజమో కూడా తెలియడం లేదు. సర్వేల్లో టీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే…అది టీఆర్ఎస్ సొంత సర్వే అని విమర్శలు వస్తున్నాయి…బీజేపీకి అనుకూలంగా ఉంటే..అది ఆ పార్టీ సర్వే అంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి కొన్ని సర్వేలు అనుకూలంగా వస్తున్నాయి…వీటిని నమ్మడానికి లేదని విమర్శలు వస్తున్నాయి.

అయితే ఈ సర్వేలు రాజకీయ పార్టీల సృష్టి అని మాత్రం అర్ధమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎవరికి వారు ప్రజలని డైవర్ట్ చేయడానికి సర్వేల పేరిట రాజకీయం నడుపుతున్నారని చెబుతున్నారు. వీటి వల్ల ఏది ఫేక్ సర్వే…ఏది నిజమైన సర్వే అనేది తెలియకుండా పోతుంది. ఈ మధ్య కాలంలో పీకే టీం పేరిట ఎక్కువ సర్వేలు వచ్చాయి. మరి వాటిల్లో ఏది నిజమో తెలియదు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌కు 25 సీట్లు మాత్రమే వస్తాయని, మరో 17 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని…కాంగ్రెస్‌ 32 స్థానాల్లో గెలుస్తుందని, మరో 23 స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని.. బీజేపీకి 6 నుంచి 8 సీట్లలో గెలుపు, మరో 8 సీట్లలో పోటీలో ఉంటుందని, ఎంఐఎం 5 నుంచి 7 సీట్లలో గెలిచే అవకాశం ఉందని పీకే రిపోర్టు లో తేలిందని ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పారు.

తాజాగా వచ్చిన ఆరా సంస్థ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 38 శాతం, బీజేపీకి 30 శాతం, కాంగ్రెస్ 23 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఇక వెంటనే ఐ‌పి‌ఎస్‌ఎస్(ఇండియన్ పోలిటికల్ సర్వేస్ అండ్ స్టాటజీస్ టీం), ఎస్‌ఏ‌ఎస్(శ్రీ ఆత్మసాక్షి) సంస్థల పేరిట మరో సర్వే బయటకొచ్చింది. వీరి సర్వే ప్రకారం…టీఆర్ఎస్-48, కాంగ్రెస్-30, బీజేపీ-11, ఎం‌ఐ‌ఎం-7 సీట్లు గెలుచుకుంటాయని ఆ సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.

అయితే 23 సీట్లలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది..అందులో టీఆర్ఎస్10-11 సీట్లు, కాంగ్రెస్ 7-9 సీట్లు, బీజేపీ 3-5 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇలా వరుసగా కొన్ని సర్వేలు బయటకొచ్చాయి…ఒకో సర్వేలో ఒకోలా ఫలితాలు ఉంటున్నాయి. మరి వీటిల్లో ఏది నమ్మాలి..ఏది నమ్మకూడదనేది క్లారిటీ లేకుండా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news