నెదర్లాండ్ తో మ్యాచ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న స్మిత్

-

వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డచ్ తో మ్యాచ్ లో ఆసిస్ తమ జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్ రౌండర్ స్టోయినిష్ స్థానంలో కామెరున్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చాడు. నెదర్లాండ్ జట్టు మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులను చేయలేదు. ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 40 బాల్స్ లో 44 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా జట్టు పరుగులను రాబడుతోంది. నెదర్లాండ్ బౌలర్లు కూడా వికెట్లను కూడా తీస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ మెచెల్ మార్ష్ 15 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నారు. వీరుద్దరూ కుదుకుంటే సెంచరీలు సాధిచడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ప్రధానంగా స్మిత్ హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇదే ఊపు కొనసాగిస్తే హా ఫ్ సెంచరీతో పాటు సెంచరీ సాధించే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news