భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. టీమిండియా విజయానికి మరో రెండు వికెట్లు మాత్రమే విగిలి ఉన్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడుతున్న సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత్ జట్టు బౌలర్లు షమి 3 వికెట్లు తీసుకున్నాడు. ఉమేష్ 2, జాడేజా, అశ్విన్ చెరో వికెట్ పడకొట్టారు.
అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్ ను 497/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. బదులుగా తొలి ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 162 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ ఉచ్చులో పడింది. రెండో ఇన్నింగ్స్ లోనూ సఫారీ బ్యాట్స్ మన్లు పేలవ ఆటతీరుతో మూల్యం చెల్లించుకున్నారు. కాగా, దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గార్ భారత పేసర్ ఉమేశ్ బౌలింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతని బదులు కాంకషన్ సబ్ స్టిట్యూట్ గా థియొనిస్ డిబ్రుయిన్ బ్యాటింగ్ ఆర్డర్ లోకి వచ్చాడు.