ఒకప్పుడు క్రికెట్లో రాణించిన స్టార్ ప్లేయర్స్.. రిటైర్ అయిన తర్వాత తమకు నచ్చిన వ్యాపార రంగంలో అడుగుపెట్టి.. అక్కడా రాణిస్తున్నారు. వ్యాపారంలోనూ సూపర్ టర్నోవర్లతో సక్సెస్ అందుకుని దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సచిన్, ధోనీ తమ తమ వ్యాపార రంగాల్లో సూపర్ సక్సెస్‌తో దూసుకెళ్తుండగా.. తాజాగా ఆ జాబితాలో సురేశ్ రైనా చేరాడు.
అన్ని ఫార్మాట్లలో క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రైనా ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇండియన్ క్యూజిన్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. తన సోషల్ మీడియాలో రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన రైనా.. ‘ఆమ్‌స్టర్‌డామ్‌లోని రైనా ఇండియన్ రెస్టారెంట్‌ను మీకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఎంత ఫుడ్ లవర్‌నో మీకు ఇప్పటికే తెలుసు. ఇప్పుడు ఇక్కడి భారతీయులకు, ఇటు స్థానికులకు భారతదేశంలోని వివిధ రకాల వంటకాలను పరిచయం చేయనున్నాను’ అంటూ క్యాప్షన్‌ను జోడించారు.