జపాన్ లో ఓరుగల్లు ముత్యం మెరిసింది. అయినా కూడా మీడియాకు పట్టడం లేదు ఈ మట్టిలో మాణిక్యం. బస్సు టిక్కెట్ కటకటా నుండి విమానం ఎక్కింది తెలంగాణ బిడ్డ. చిల్లి గవ్వా లేకున్నా మొక్కవోని స్పూర్తితో దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చింది దీప్తి జీవంజి. ఈ అమ్మాయి ఎవరో మనలో చాలా మందికి తెలియక పోవచ్చు.ఈ మధ్య పొలిటికల్ న్యూస్ కి,పనికి మాలిన రేవ్ పార్టీలకు ఇచ్చే కవరేజ్ లో ఇలాంటి ఆణిముత్యాలకు ఇస్తే కదా మనకు తెలిసేది.
వరంగల్ నుండి హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకుందాం అంటే బస్ టికెట్ల కి కూడా పైసలు లేవు. అమ్మ నాయనాలు రోజువారీ కూలీలు. అయ్యా మా తాన పైసలు లేవు అని ఆ పిల్లా అమ్మ నాయనా చెప్తే ఆ కోచ్ ఎమ్ కాదు లే నేను సుస్కుంటా అని చెప్పి బస్ ఎక్కించి హైదరాబాద్ కి తీస్కొచి కోచింగ్ ఇప్పించిండు. సిన్ కట్ చేస్తే….. మొన్న జపాన్ లో జరిగిన టీ20 ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్ షిప్ లో పరుగుపందెం లో గోల్డ్ మెడల్ సాధించింది, రికార్డులు బద్దలు కొట్టింది. 400 Meters 55.07 సెకండ్స్ లో స్మాష్ చేసింది. పోయిన సంవత్సరం US ఛాంపియన్ షిప్ రికార్డ్ కూడా బద్దలు కొట్టింది ఏదైనా పని చెయ్యాలంటే వంద సాకులు చెప్పే మనకు, తన చెదరని సంకల్పం ఆదర్శం.