ముంబై టెస్ట్ మ్యాచ్ లో భారత్ లక్ష్య 147 పరుగల లక్ష్య ఛేదనలో తడబడుతోంది. రెండో ఇన్నింగ్స్ న్యూజిలాండ్ జట్టు 174 పరుగులు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అయితే భారత బ్యాటర్లు మాత్రం కాస్త తడబడుతున్నారు. 29 పరుగుల వద్ద భారత్ 5 కీలక వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ (11), శుబ్ మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ(1) యశస్వి జైస్వాల్ (4), సర్పరాజ్ ఖాన్ (1) పరుగులు చేసి ఔట్ అయ్యారు.
ప్రస్తుతం రిషబ్ పంత్ (7), రవీంద్ర జడేజా (1) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ 3 కీలక వికెట్లు తీశాడు. ఫిలిప్స్ యశస్వి జైస్వాల్, హెన్రీ రోహిత్ శర్మ వికెట్లను తీశాడు. గిల్, కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ ముగ్గురి వికెట్లను అజాజ్ పటేల్ తీశాడు. దీంతో న్యూజిలాండ్ సంతోషపడుతోంది. టీమిండియా అభిమానులు మాత్రం కాస్త నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 31-5 ఉంది. నిలకడగా ఆడితే విజయం వరించే అవకాశముంది.