చివరి టెస్టులో కష్టాల్లో పడింది టీమిండియా. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ సమం కావాలంటే తప్పక గెలవాల్సిన అయిదో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. యశస్వీ జైస్వాల్ 10, కేఎల్ రాహుల్ 4, శుభ్ మన్ గిల్ 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. కోహ్లీ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
దీంతో టీమిండియా 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, బొలాండ్, నాథన్ లియన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. టీం నుంచి కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించారు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న 5వ టెస్ట్ మ్యాచ్ కు కెప్టె న్ రోహిత్ శర్మ ను కాదని.. బుమ్రాకు బాధ్యతలు ఇచ్చారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో… కేఎల్ రాహుల్ ఓపెనర్ వెళ్లాడు.