2025లో ధ్యానం అలవాటు కావాలంటే తప్పకుండా పాటించాల్సిన టిప్స్

-

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయడం కన్నా మంచి మార్గం మరోటి లేదని చెప్పవచ్చు. ఎమోషనల్ గా బలంగా తయారవడానికి ధ్యానం బాగా పనిచేస్తుంది. ధ్యానం అనేది ఈ మధ్య తెరమీదకు వచ్చిన ప్రక్రియ కాదు. అనాదిగా భారతదేశ సంస్కృతిలో ఉన్నదే. 2025లో ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకుని మంచి జీవితాన్ని జీవించాలని మీరు అనుకుంటే వెంటనే ధ్యానం మొదలుపెట్టండి.

అయితే మొదలు పెట్టేటపుడు ఈ కింది విషయాలను గుర్తుంచుకోండి.

నిశ్శబ్దమైన ప్రదేశం ఎంచుకోండి:

ధ్యానం చేయాలనుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్రదేశం ఎంచుకోండి. మీరు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు కాబట్టి ఫోకస్ మారిపోకూడదంటే ధ్యానం చేసే ప్రదేశం బాగుండాలి. లేదంటే డైవర్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ.

శ్వాస మీద ధ్యాస:

ధ్యానం చేస్తుంటే మనసులోకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మీరు కొత్త కాబట్టి. మీ దృష్టిని పూర్తిగా మీ శ్వాస మీద పెడితే ఆలోచనలు రావు. శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదిలినపుడు మీ శరీరం ఎలా ఫీలవుతుందో గమనించండి.

మంత్రం చేసే సాయం:

మీరింకా ధ్యానంలో పర్ఫెక్ట్ కాలేదు కావున సైలెంట్ గా ధ్యానం చేస్తుంటే బోర్ కొట్టే అవకాశం ఉంది. అందుకే ఏదైనా మంత్రం జపించండి. ఉదాహరణకు ఓం ఓం.. అని జపిస్తూ ధ్యానం చేయండి. దీనివల్ల మీకు సమయం తెలియదు.

నెమ్మదిగా పెంచండి:

ధ్యానం చేసే సమయాన్ని రోజూ కొంత పెంచండి. మొదట్లోనే పది నిమిషాలు చేయాలను ఫిక్స్ అవ్వొద్దు. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది. అలవాటు అయ్యేంత వరకు తక్కువ సమయం చేసి, అలవాటు పడిన తర్వాత సమయాన్ని పెంచండి.

Read more RELATED
Recommended to you

Latest news