T20 World Cup 2024: ఇంగ్లాండ్ పై రెండేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

-

T20 World Cup 2024: ఇంగ్లాండ్ పై రెండేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. రెండేళ్ల కింద జరిగిన ఘోర పరాభవానికి టీం ఇండియా రివెంజ్ తీర్చుకుంది. 2022 వరల్డ్ కప్ సెమీస్ లో 10 వికెట్ల తేడాతో భారత్ ను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది.

Team India took revenge on England after two years

దీంతో టీం ఇండియా అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈ విజయంతో భారత ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు.

ఇక అటు టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. డగౌట్ లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు. సహచర ఆటగాళ్లు ఆయనను ఓదారుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, రోహిత్ ఐసిసి టోర్నమెంట్లలో 27 మ్యాచ్ లకు సారథ్యం వహించారు. అందులో 24 మ్యాచుల్లో జట్టును గెలిపించారు. నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. విన్నింగ్ పర్సంటేజీ 81.47%గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news