ప్రపంచ క్రికెట్ మరువలేని రోజు ఇది…!

సరిగా 31 సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రపంచ క్రికెట్ లో ఓ అద్భుతం జరిగింది. టీం ఇండియా మాజీ ఆటగాడు, ప్రపంచ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి నేటికి 31 ఏళ్ళు అయింది. 16 సంవత్సరాల 205 రోజుల వయసులో ఇదే రోజున సచిన్ కరాచీలో తన మొదటి టెస్ట్ ఆడాడు. ఇమ్రాన్ ఖాన్ మరియు వసీం అక్రమ్ వంటి పాకిస్తాన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.

నవంబర్ 15, 1989 న కరాచీలో టెస్ట్ అరంగేట్రం చేశాడు. సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌ లో అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌ లో 34,000 పరుగులు చేశాడు. తొలి టెస్టులో సచిన్ టెండూల్కర్ 15 పరుగులు మాత్రమే చేసినా సరే అతను పాక్ బౌలింగ్ ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాడు. వకార్ యూనిస్ మనోజ్ ప్రభాకర్ ను బౌల్డ్ చేసాక… సచిన్ క్రీజ్ లోకి వచ్చాడు.