ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్న క్రీడాకారులు: India at Tokyo 2020

నిజంగా టోక్యో ఒలంపిక్స్ (Tokyo olympics) లో చోటు దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదు. అయితే మనం గత మూడు ఎడిషన్స్ నుంచి చూసుకుంటే.. సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ లో భారతీయ క్రీడాకారులు పెరుగుతున్నారు.

టోక్యో ఒలింపిక్స్ | Tokyo Olympics

టోక్యో 2020 లో కూడా భారతీయులు అరుదైన స్థానాన్ని దక్కించుకున్నారు. నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయం. పదుల్లో కాదు ఏకంగా వందల మంది భారతీయ క్రీడాకారులు టోక్యో ఒలంపిక్స్ కి క్వాలిఫై అయ్యారు.

వీళ్లలో రెండు రిలే (relay) మరియు రెండు హాకీ జట్లు (hockey teams) కూడా ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్న భారతీయ క్రీడాకారులు వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటి కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

ఆర్చరీ (Archery) :

తరుణదీప్ రాయ్, Men’s Recurve
అతను దాస్, Men’s Recurve
ప్రవీణ్ జాదవ్, Men’s Recurve
దీపిక కుమారి, Women’s Recurve

అథ్లెటిక్స్ (Athletics) :

ఒలంపిక్స్ కి సెలెక్ట్ అయిన అథ్లెటిక్స్ బలమైన వాళ్లు కాదు. కానీ జావెలిన్ త్రోయర్స్ నీరజ్ చోప్రా మరియు శివపాల్ సింగ్ ఈ సమయంలో ఆశలని పెంచేశారు.

మార్చి 2019 లో, 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా కెటి ఇర్ఫాన్ మొదట ఆశలని పెంచాడు. తర్వాత భారత స్ప్రింట్ ఏస్ డ్యూటీ చంద్ తన రెండవ ఒలింపిక్ ప్రదర్శన కోసం సెలెక్ట్ అవ్వడం జరిగింది.

కెటి ఇర్ఫాన్, Men’s 20km race walking
సందీప్ కుమార్, Men’s 20km race walking
రాహుల్ రోహిల్లా, Men’s 20km race walking
గుర్ప్రీత్ సింగ్, Men’s 20km race walking
భావ్నా జాట్, Women’s 20km race walking
ప్రియాంక గోస్వామి, Women’s 20km race walking
అవినాష్ సేబుల్, Men’s 3000m steeplechase
మురళి శ్రీశంకర్, long jump men’s
ఎంపి జబీర్, men’s 400m
నీరజ్ చోప్రా, Men’s javelin throw
శివపాల్ సింగ్, Men’s javelin throw
అన్నూ రాణి, Women’s javelin throw
తాజిందర్‌పాల్ సింగ్ టూర్, Men’s shot put
డ్యూటీ చంద్, మహిళల 100 మీ, 200 మీ
కమల్‌ప్రీత్ కౌర్, ఉమెన్స్ డిస్కస్ త్రో
సీమా పునియా, ఉమెన్స్ డిస్కస్ త్రో
4×400 మిక్స్డ్ రిలే
పురుషుల 4×400 మీ

బాడ్మింటన్ (Badminton) :

ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు మహిళల సింగిల్స్ లో టోక్యోలోని పాల్గొన్నప్పుడు గతంలో వచ్చిన రజత పతాకాన్ని మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే విధంగా పురుషుల సింగిల్స్ లో బి సాయి ప్రణీత్ మరియు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి డబుల్స్ గా పాల్గొన్నారు.

పీవీ సింధు (ఉమెన్స్ సింగిల్స్)
సాయి ప్రణీత్ (మెన్స్ సింగిల్స్)
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి (మెన్స్ డబుల్స్)

బాక్సింగ్ (boxing) :

జోర్డాన్‌, అమ్మాన్‌లో జరిగిన ఆసియా ఓషియానియా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌కు భారత బాక్సర్లు తొమ్మిది మంది అర్హత సాధించారు. ఇక వారి వివరాలని చూస్తే..

వికాస్ క్రిషన్ (పురుషుల, 69 కిలోలు)
లోవ్లినా బోర్గోహైన్ (మహిళల, 69 కిలోలు)
ఆశిష్ కుమార్ (పురుషుల, 75 కిలోలు)
పూజ రాణి (మహిళల, 75 కిలోలు)
సతీష్ కుమార్ (పురుషుల, 91 కిలోలు)
మేరీ కోమ్ (మహిళల, 51 కిలోలు)
అమిత్ పంగల్ (పురుషుల, 52 కిలోలు)
మనీష్ కౌశిక్ (పురుషుల, 63 కిలోలు)
సిమ్రాంజిత్ కౌర్ (మహిళల, 60 కిలోలు)

ఈక్వెస్ట్రియన్ (Equestrian):

ఫౌవాడ్ మీర్జా (Fouaad Mirza) గత 20 సంవత్సరాలలో క్రీడలకు అర్హత సాధించిన మొదటి భారత ఈక్వెస్ట్రియన్.

ఫెన్సింగ్ (Fencing):

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా భవానీ దేవి నిలిచింది. AOR పద్ధతి ద్వారా చెన్నైకి చెందిన సాబెర్ ఫెన్సర్ టోక్యో తన స్లాట్‌ను బుక్ చేసుకున్నాడు. ఇలా భవానీ దేవి కూడా అర్హత సాధించింది.

గోల్ఫ్ (Golf) :

టోక్యో 2020 లో గోల్ఫ్‌లో భారత్ లో ముగ్గురికి అవకాశం దక్కింది. వివరాలని చూస్తే.. అనిర్బన్ లాహిరి, ఉదయన్ మానే పురుషుల పోటీలో, అదితి అశోక్ మహిళల పోటీలో పాల్గొన్నారు.

అనిర్బన్ లాహిరి
ఉదయన్ మానే
అదితి అశోక్

జిమ్నాస్టిక్స్ (Gymnastics) :

ప్రణతి నాయక్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండవ భారతీయ మహిళా జిమ్నాస్ట్ మాత్రమే. ఇలా ఈమెకి కూడా అవకాశం దక్కింది.

హాకీ (Hockey) :

పురుషుల జాతీయ జట్టు
మహిళల జాతీయ జట్టు

భారత పురుషులు 20 వ సారి ఒలింపిక్స్ లో పాల్గొనగా.. మహిళలు మూడవసారి పాల్గొనున్నారు.
మన్‌ప్రీత్ సింగ్ (పురుషుల), రాణి రాంపాల్ (మహిళల) నేతృత్వంలోని ఇరు జట్లు 2019 నవంబర్‌లో అర్హత సాధించగా, ప్రతి ఒక్కరూ 16 మంది సభ్యుల బృందాన్ని టోక్యో 2020 కి లో ఆడడం జరిగింది.

జూడో (Judo):

టోక్యో 2020 లో జూడోలో భారతదేశంలో పాల్గొన్న ఏకైక వ్యక్తి సుశీలా దేవి లిక్మాబామ్. ఇలా ఈమెకి కూడా అవకాశం దక్కింది.

రోయింగ్ (Rowing):

అర్జున్ జట్ మరియు అరవింద్ సింగ్ టోక్యో 2020 లో రోయింగ్ లో ఎంపిక అయ్యారు.

సెయిలింగ్ (Sailing):

ఇక సెయిలింగ్ లో చూస్తే..

నేత్ర కుమానం, Laser Radial
విష్ణు శరవణన్, Laser Standard
KC గణపతి వరుణ్ థక్కర్, 49er

షూటింగ్ (Shooting):

అంజుమ్ మౌద్గిల్, 10m Women’s Air Rifle
అపూర్వీ చండేలా, 10m Women’s Air Rifle
దివ్యాన్ష్ సింగ్ పన్వార్, 10m Men’s Air Rifle
దీపక్ కుమార్, 10m Men’s Air Rifle
తేజస్విని సావాన్ట్, 50m Women’s Rifle 3 Position
సంజీవ్ రాజపూత్, 50m Men’s Rifle 3 Position
ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, 50m Men’s Rifle 3 Position
మను బక్ర్, 10m Women’s Air Pistol
యశస్వినీ సింగ్ దేశ్వర్, 10m Women’s Air Pistol
సౌరభ్ చౌదరి, 10m Men’s Air Pistol
అభిషేక్ వర్మ, 10m Men’s Air Pistol
రహి సర్నోబత్, 25m Women’s Pistol
చింకి యాదవ్, 25m Women’s Pistol (replaced by Elavenil Valarivan)
అంగద్ వీర్ సింగ్ బజ్వా, Men’s Skeet
మైరాజ్ అహ్మద్ ఖాన్, Men’s Skeet

స్విమ్మింగ్ (Swimming):

సాజన్ ప్రకాష్, men’s 200m butterfly
శ్రీహరి నటరాజ్, men’s 100m backstroke
మాన పటేల్, women’s 100m backstroke

టేబుల్ టెన్నిస్ (Table Tennis) :

మార్చిలో దోహాలో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో నలుగురు భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

శరత్ కమల్
సాథియాన్ జ్ఞానశేఖరన్
సుతీర్థ ముఖేర్జీ
మానిక బాత్రా

టెన్నిస్ (tennis ):

1992 తరువాత మొదటిసారి, ఒలింపిక్ క్రీడలలో భారత పురుష టెన్నిస్ ఆటగాడు ఆడరు. సానియా మీర్జా టోక్యో 2020 కి అర్హత సాధించింది మరియు ఆమె మహిళల డబుల్స్‌లో అంకితా రైనాను తన భాగస్వామిగా ఎంచుకుంది.

సానియా మీర్జా మరియు అంకిత రైనా, Women’s Doubles

వెయిట్ లిఫ్టింగ్ (Weightlifting):

టోక్యో 2020 లో వెయిట్ లిఫ్టింగ్‌లో భారతదేశం నుండి మీరాబాయి చాను ఎంపికయ్యారు.

wrestling :

టోక్యో 2020 కోసం రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తమ సీట్లను ధృవీకరించింది. 62 కిలోల విభాగంలో సోనమ్ మాలిక్ కోటాను గెలుచుకోవడంతో, రియో ​​2016 కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ టోక్యో ఒలింపిక్స్‌లో కుస్తీ పడరు. ఇక టోక్యో 2020 లో చోటు దక్కించుకున్న వారి వివరాలలోకి వెళితే..

సీమ బిస్లా, Women’s Freestyle, 50kg
వినీష్ ఫోగత్, Women’s Freestyle 53kg
అన్షు మాలిక్, Women’s Freestyle 57kg
సోనమ్ మాలిక్, Women’s Freestyle 62kg
రవి కుమార్ దహియా, Men’s Freestyle 57kg
బజరంగ్ పునియా, Men’s Freestyle 65kg
దీపక్ పునియా, Men’s Freestyle 86 kg