2024 టీ20 వరల్డ్‌కప్‌లో పసికూన అమెరికా చేతిలో పాకిస్థాన్ పరాజయం పాలైంది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో అమెరికా విజయం సాధించింది. ఇద్దరూ పోటాపోటీగా ఆడినా స్కోర్లు సమం కావడం వల్ల సూపర్ ఓవర్ తప్పలేదు. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో మొదట అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్థాన్ 13 మాత్రమే చేసి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను అమెరికా బాగానే కట్టడి చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బౌలర్లు చెలరేగిపోయారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ఇందులో 7 రన్స్ ఎక్స్ ట్రాలే. 19 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ 13/1 రన్స్‌కు పరిమితమైంది.