టి20లకు కోహ్లీ గుడ్ బై…?

అంతర్జాతీయ క్రికెట్ లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జట్టు కోసం ఎంతో విలువైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఎన్నో సెంచరీలు చేస్తున్నాడు కోహ్లీ. ప్రస్తుతం మోడరన్ డే గ్రేట్స్ లో కోహ్లీ తర్వాతే ఎవరైనా అనేది అందరికి తెలిసిన విషయమే. అంతర్జాతీయంగా కోహ్లీ ఇప్పుడు చాలా బిజీ గా ఉన్నాడు. వరుసగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు.

దాదాపు అన్ని మ్యాచుల్లో కోహ్లీ ఉంటున్నాడు. అన్ని దేశాల్లోను క్రికెట్ ఆడుతున్నాడు. గత 8 ఏళ్ళు గా కోహ్లీ లేని సీరీస్ లను వేళ్ళు మీద లెక్క పెట్టవచ్చు. క్రికెట్ లో తన మార్క్ చూపిస్తున్న కోహ్లీ ఇప్పుడు అలసిపోతున్నాడు. అవును అంతర్జాతీయ క్రికెట్ లో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడు కోహ్లీ. టి20 లకు గుడ్ బై చెప్పడానికి సిద్దంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా కోహ్లీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. తన శరీరం అలసిపోతుంది అని ప్రయాణాలు, ప్రాక్టీస్ ఇలా ప్రతీ దానికి తాను ఇబ్బంది పడుతున్నా అని చెప్పాడు. 2021 టి20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆ సారధ్య బాధ్యతలను కోహ్లీ నుంచి రోహిత్ కి అప్పగించే అవకాశాలు కనపడుతున్నాయి. దీనిపై స్పష్టత త్వరలో వచ్చే అవకాశం ఉంది.