ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టుల్లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దాదాపు 1089 రోజుల తర్వాత శతకం బాదిన వార్నర్, వందను డబుల్ సెంచరీగా మలచడంలో సఫలమయ్యాడు.
మెల్బోర్న్ వేదికగా రెండో రోజు ఆటలో రబడ బౌలింగ్ లో వంద పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనర్, లుంగి ఎంగిడి బౌలింగ్ లో 200 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలు రికార్డులు నమోదు చేసిన వార్నర్ మరో అరుదైన ఘనత సాధించాడు.