WORLD CUP 2023: చేతులెత్తేసిన బంగ్లాదేశ్ బౌలర్లు.. విజయం దిశగా కివీస్ !

-

చెన్నై లోకి చెపాక్ మైదానంలో న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో విలియమ్సన్ సేన హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతోంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చాలా నిదానంగా సాఫీగా ఆడుకుంటూ విజయానికి చేరువకానున్నారు. బౌలర్లకు సహకరించే పిచ్ అయినప్పటికీ బంగ్లా బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు.. ఆరంభంలో తీసిన రవీంద్ర వికెట్ మినహా పెద్దగా ఉపయోగపడే బౌలింగ్ ఏమీ చేయలేదు బంగ్లాదేశ్. మొదటి వికెట్ పడిన తర్వాత పరుగులు గ్యాప్ ఇవ్వకుండా కనుక వికెట్ తీసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ క్రీజులో విలియమ్సన్ కాన్ వే లు బలంగా పాతుకుపోవడం వలన బంగ్లాదేశ్ కు పుంజుకునే అవకాశమే లేకుండా పోయింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజర్ మరియు షకీబ్ లు మాత్రమే వికెట్లు తీశారు.

మిగిలిన వారంతా వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీనితో బంగ్లాదేశ్ కు వరుసగా రెండవ ఓటమి తప్పేలా లేదు.. ఇక మరోవైపు న్యూజిలాండ్ కూడా హ్యాట్రిక్ విజయం దిశగా సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news