ఆసక్తిరేపుతున్న ‘కేసీఆర్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల..

-

జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పొలిటికల్ డ్రామాతో పవర్ ఫుల్ గా ‘కేసీఆర్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. సినిమా టైటిల్‌లో కేసీఆర్ (కేశవ చంద్ర రామావత్) అని రివీల్‌ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బీఆర్‌ఎస్ మంత్రి మల్లా రెడ్డి 50 వేల మంది విద్యార్థుల సమక్షంలో ఈరోజు విడుదల చేశారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణ కూతురు అనన్య మీనన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

పవర్‌ఫుల్‌గా కేసీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పోలి ఉన్న భారీ కటౌట్ ముందు ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. ఒక రైతు, బంజారా మహిళలు, గొర్రెలు ప్రధానంగా గ్రామ వాతావరణాన్ని, తెలంగాణ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడాన్ని మనం గమనించవచ్చు. బంజారా సామాజిక వర్గానికి చెందిన వారి జీవితాలను కథాంశంతో తెరకెక్కించనున్నారు.

ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా విభూది ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గరుడ వేగ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు కెమెరాను కూడా అందిస్తున్నారు. సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్, ధనరాజ్ తో పాటు తాగుబోతు రమేష్, రచ్చ రవి, జోర్దార్ సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలంగాణ మ్యాస్ట్రో చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు గరుడవేగ అంజి డీవోపీగా కూడా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news