వావ్; గంటలో రోహిత్ పై లక్ష ట్వీట్స్…!

-

నాలుగు బంతుల్లో వచ్చింది 8 పరుగులే. చివరి రెండు బంతుల్లో పది పరుగులు రావాలి. అంటే ఒక సిక్స్ ఒక ఫోర్ కచ్చితంగా పడాల్సిందే. రెండు ఫోర్లు పడినా మ్యాచ్ ఓడిపోతాం. కాబట్టి సిక్స్ అనేది అవసరం ఫోర్ కూడా అవసరమే. అనూహ్యంగా ఓవర్లో 5 బంతి భారీ సిక్స్. ఆరో బంతికి ఫోర్ కొట్టాలి. ప్రత్యర్ధి జట్టు ఫీల్డింగ్ ని భారీగా మోహరించింది. ఎటు వైపు బంతి వెళ్ళకుండా బౌండరి నలుమూలలా 9 మంది ఫీల్డర్లు కాచుకున్నారు.

అనూహ్యంగా ఆరో బంతి సిక్స్ అయింది. స్టేడియం లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. టీం ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టి20 లో సూపర్ ఓవర్ లో జరిగిన సీన్ ఇది. క్రీజ్ లో ఉంది రోహిత్ శర్మ, బౌలింగ్ చేసేది వరల్డ్ రేంజ్ బౌలర్. దీనితో మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే రోహిత్ శర్మ మాత్రం కూల్ గా తన పని తాను కానిచ్చాడు.

దీనితో ఇప్పుడు అతని పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ట్విట్టర్ లో అయితే గంటలో అతనిపై 32 వేల ట్వీట్స్ చేసారు అంటే ఏ విధంగా రోహిత్ పేరు ట్రెండ్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఒక్క మన దేశంలో మాత్రమే. ఇతర కివీస్ లో కూడా కలిపితే 62 వేల సార్లు రోహిత్ ట్రెండ్ అయ్యాడు. వరల్డ్ వైడ్ గా ఆ సంఖ్య లక్ష వరకు ఉంటుంది. దీనితో బుధవారం ట్విట్టర్ లో రోహిత్ మేనియా నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news