కొడుకుల వల్ల ఎన్.టి.ఆర్ ఏమాత్రం సుఖపడలేదు.. డబ్బు కవర్ల కోసమే.. సీనియర్ ఎన్.టి.ఆర్ డ్రైవర్ బయటపెట్టిన నిజాలు..!

114

ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాల వల్ల తమకు తెలిసిన ఎన్.టి.ఆర్ హీరో, పొలిటిషియన్ కాని కథనాయకుడు, మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాల వల్ల ఎన్.టి.ఆర్ జీవితానికి సంబందించి మరింత లోతుల్లో తెలుసుకున్నారు. అయితే వచ్చిన బయోపిక్ సినిమాల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది తెలియదు కాని సినిమాలో ప్రస్థావించినవన్ని నిజాలే అన్నట్టుగా చెబుతున్నారు.

అయితే ఎన్.టి.ఆర్ గురించి ఆయన డ్రైవర్ లక్ష్మణ్ కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. ఎన్.టి.ఆర్ చైతన్య రథానికి లక్ష్మణ్ డ్రైవర్ గా పనిచేశారు. కొడుకుల విషయంలో ఎప్పుడూ ఎన్.టి.ఆర్ బాధపడేవారని.. కొడుకుల వల్ల ఎలాంటి సుఖపడలేదని అన్నాడు లక్ష్మణ్. తనతో కూడా కొడుకుల గురించి చెబుతూ బాదపడే వారని అన్నారు లక్ష్మణ్.


ఎన్.టి.ఆర్ కొడుకులు కూర్చుని తినడమే కాని కష్టపడి పైకొద్దామని ఎవరికి లేదని.. ఆ విషయమై ఏం లచ్చన్నా కొడుకులెవరూ ప్రయోజకుడు అయ్యేలా లేడు.. నా పేరు నిలబెట్టేలా లేడని.. బాలయ్య కొద్దిగా బెటరని కాని పూర్తిగా నమ్మకం లేదని అన్నారట. మొదటిసారి సిఎం అయినప్పుడు జయశంకర్ ను కూర్చోబెట్టి ఓ ఫ్యాక్టరీ పెట్టి ఐదు, పదివేల మందికి భోజనాలు పెట్టొచ్చని అన్నారట. థియేటర్ చూసుకోవడం ఏంటి అది కూడా మేనేజర్లతో నడిపిస్తున్నారని జయశంకర్ గురించి పెద్దాయన తనతో మాట్లాడిన విషయాలను చెప్పుకొచ్చారు లక్ష్మణ్.

కొడుకులతో ఎన్.టి.ఆర్ సుఖపడలేదని.. రోడ్ నంబర్ 13న పురందేశ్వరి ఉండేదని ఆమె అప్పుడప్పుడు క్యారేజ్ పట్టుకుని వచ్చేవారని.. కొడుకులంతా డబ్బు కోసమే వస్తారని అన్నాడు. అవసరం వచ్చినప్పుడు వచ్చి డబ్బు కవర్ తీసుకుని వెళ్లేవారని అన్నారు లక్ష్మణ్.