చిత్రలహరి 2 డేస్ కలక్షన్స్.. తేజూ హిట్ కొట్టాడబ్బా..!

-

వరుస గా ఆరు సినిమాలు ఫ్లాపులవడంతో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ చిత్రలహరి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో తెరకెక్కిన చిత్రలహరి సినిమా శుక్రవారం రిలీజై పర్వాలేదు అనిపించుకుంది. సినిమా ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక మొదటి రోజు ఏపి, తెలంగాణాల్లో 3 కోట్ల వసూళ్లతో అదరగొట్టిన సాయి తేజ్ రెండో రోజు కూడా 2 కోట్ల పైగా వసూళ్లు తెచ్చుకున్నాడు.

రెండు రోజుల్లో చిత్రలహరి తెలుగు రెండు రాష్ట్రాల్లో 5.38 కోట్ల వసూళ్లను రాబట్టింది. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా సాయి తేజ్ కు హిట్ కల నెరవేర్చిందని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు.

ఏరియాల వారిగా చిత్రలహరి రెండు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే :

నైజాం : 1065 కోట్లు
సీడెడ్: 0.90 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.77 కోట్లు
కృష్ణ: 0.41 కోట్లు
గుంటూరు: 0.48 కోట్లు
ఈస్ట్ : 0.58 కోట్లు
వెస్ట్: 0.37 కోట్లు
నెల్లూరు: 0.22 కోట్లు

ఎపీ/ తెలంగాణా : 5.38 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news