సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇటీవలే పార్టీలో చేరిన శ్రీ నారాయణ శ్రీ గణేష్ ని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారం ఓడలో ఉన్నంత సేపు ఓడ మల్లయ్య ఒడ్డు దిగిన తర్వాత బోడ మల్లయ్య అని అన్నారు. అలానే రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరినైనా ఎన్నికల్లో నిలబెట్టే అధికారం ఉంటుందని కానీ 2023 ఎన్నికల్లో పార్టీ గెలుపు కొరకు కీర్తిశేషులు గద్దర్ అన్న కూతురుని ఈ పోటీలో నిలబెట్టి అధికారం లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం మోసం అని అన్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహారం ఓడలో ఉన్నంతవరకు ఓడ మల్లయ్య ఒడ్డు చేరిన తర్వాత బోడి మల్లయ్య అని ఎద్దేవ చేశారు వయోభారంతో అలసిపోయినప్పటికీ పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కానీ కష్టకాలంలో పాదయాత్రలు చేసి ఆడి పాడి చేసిన గద్దర్ అన్నని వారి కుటుంబాన్ని అవకాశవాదంతో విమర్శించి అవమానించడం నేరమని అన్నారు.