చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని.. ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.
జనసేన, బీజేపీలో ఉన్నవాళ్లకు నిరాశే. కూటమిలో ఉన్నా చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారు అయ్యాయి. కానీ, 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారు. పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ
కనుమరుగు అవుతుంది. 2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన పాలనను ప్రజలు మరిచిపోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఈవో మీదకు దూకుడుగా వెళ్లారని తెలిపారు.