ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. పల్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంటనే రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు.
రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. కౌలు రైతులకి హామీ ఇచ్చిన విధంగా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర అందించకపోవడంతో పాటుగా 500 రూపాయల బోనస్ చెల్లించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధ పాలన కారణంగా రైతులు సాగునీరు అంధకా ఇబ్బంది పడుతున్నారని అన్నారు పంట నష్టపోయిన రైతం గానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.