మహేష్, శ్రీ లీల స్టెప్పెస్తే మోత మోగి పోవాల్సిందే..!!

-

ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీ లీల కి యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. తాను సినిమాలు వరసగా చేస్తుండడం వల్ల  తన క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. అందానికి అందం, చలాకి తనం, డాన్స్ తో కుర్రాళ్ళు ను థియేటర్స్ కు వచ్చేలా చేస్తోంది. ఇక రీసెంట్ గా రవితేజ తో చేసిన ధమాకా సినిమా  రికార్డ్ వసూళ్ళు కొల్ల గొడుతోంది. తాజగా ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు దాటింది.

ఇక ఈ సినిమా తో అమ్మడు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.ప్రస్తుతం అమ్మడి చేతిలో ఇప్పటికిప్పుడు 6 సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమె డేట్స్ రెండు సంవత్సారాల వరకు ఖాళీ లేదంటే చూసుకోండి. ఈమె యవ్వారం చూసిన రవితేజ ఆమెతో నెక్స్ట్ సినిమా కు నాకు డేట్స్ దొరికేలా లేవు అని అన్నాడంటే ఆమె పాపులారిటీ అలా ఉంది. ఇక రీసెంట్ గా రెమ్యునరేషన్ కూడా డబుల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాలో కీలకమైన పాత్ర లో నటిస్తూ ఉంది. అలాగే మహేష్ బాబు సినిమా SSMB28  లో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. మొదటి హీరోయిన్ గా పూజహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు పెళ్ళి సందడి, ధమాకా సినిమా లలో తన డాన్స్ లతో ఒక ఊపు ఊపిన శ్రీ లీల టాలెంట్ ను వాడుకోవాలని ఫిక్స్ అయ్యారట. యూనిట్ వర్గాల కథనం ప్రకారం . ఈ సినిమాలో మహేశ్ బాబుకు శ్రీలీలకు ఒక ఫోక్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు అది సినిమాకే హైలైట్ గా ఉంటుందని లీకులు అందుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news