ప్రేమ పెళ్లి చేసుకుంటానంటున్న స్టార్ యాంకర్

-

యాంకర్ శ్రీముఖి అంటే పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై పటాస్ షో ద్వారా ఫేమస్ అయిన శ్రీముఖి.. ఆ తర్వాత తన యాంకరింగ్ స్టైల్ తో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తూ నటన పరంగా నిరూపించుకుంది. బిగ్ బాస్ లో రన్నరప్ గా నిలిచి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏకంగా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది.

అయితే ఈమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే రిటైర్మెంట్.. పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చేస్తోంది. పెళ్లి విషయంలో తనపై ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని తేల్చేసింది ఈ బ్యూటీ. తాను ప్రేమించిన వాడు అతడికి పెళ్లైన విషయాన్ని దాచి తనను మోసం చేశాడని.. అందుకే తాను రిలేషన్ నుంచి బయటికి వచ్చేసానని చెప్పింది శ్రీముఖి. బిగ్ బాస్‌లో ఉన్నపుడు తాను ఒకర్ని ప్రేమించి మోసపోయానని చెప్పుకొచ్చింది యాంకర్. అయితే బిగ్ బాస్ లో రవితో ప్రేమాయణం అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. భవిష్యత్తులో కూడా తాను ప్రేమ పెళ్లే చేసుకుంటానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. వన్ టైమ్ కమిట్‌మెంట్ ఉంటేనే అది లవ్ అని, అది భర్తతోనే ఉండాలని.. చివరి వరకు తనతో ఉండటాన్నే ప్రేమ అంటారని చెప్పింది ఈ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news