ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనం నెలకొందని చెబుతున్నారు. ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు హైదరాబాద్, నల్గొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి రెండు చోట్ల వడగండ్ల వర్షం కూడా భారీగా కురిసే అవకాశం ఉంది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక విజయవాడలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది విజయవాడలో ఈరోజు ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో రోడ్లమీద వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడ్డారు.