ఐపీఎల్ మినీ వేలం, అంటే కొంతమంది క్రికెటర్లను వదులుకోగా తమ వద్ద మిగిలిన సొమ్ము నుంచి తమ అవసరాల మేరకు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు లభించే అవకాశం. సాధారణంగా పెద్దగా ధరలు నమోదు కావు. కానీ ఈసారి వేలం ధరలు రాకెట్ వేగంతో ఆకాశాన్ని ఉంటాయి. ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లకు కోట్లు కుమ్మరించడంతో రికార్డు ధరలు నమోదు అయ్యాయి.
ఈ తరుణంలోనే, ఇంగ్లాండ్ టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సామ్ కర్రన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండు యంగ్ సెన్సేషన్ హారిబ్రూక్ కోసం ఫ్రాంచైజీ లన్నీ పోటీపడ్డాయి. రూ. 10 కోట్లు దాటిన తర్వాత రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు హరి బ్రూక్ కోసం పోటీ పడడంతో ధర అంతకంతకు పెరుగుతూ పోయింది. చివరికి రూ. 13 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి హారి బ్రూక్ ని కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. బేస్ ప్రైస్ రూ. 1.5 కోట్లతో మొదలైన హరి బ్రూక్ దాదాపు పది రేట్లు రెట్టింపు ధర దక్కించుకున్నాడు. భారత బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ని రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్.