టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

ఇవాళ టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ సంబంధించిన టాస్‌ కాసేపటి క్రితమే వేశారు. అయితే.. మరోసారి శ్రీలంక జట్టే .. టాస్‌ గెలిచింది. దీంతో శ్రీలంక కెప్టెన్‌ దాసున్ షానక బ్యాటింగ్‌ చేయాలని తన నిర్ణయాన్ని తెలిపాడు. దీంతో టీం ఇండియా మొదటగా బౌలింగ్‌ చేయనుంది. ఇక ఈ రోజు కూడా ధావనే కెప్టెన్‌ గా ఉండనున్నాడు.

ఇక టీం వివరాల్లోకి వస్తే….

శ్రీలంక జట్టు: అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (వి.కె), భానుకా రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలాంకా, దాసున్ షానక (సి), వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షన్ సందతన్, కసున్ రాజితన్

ఇండియా జట్టు : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్