అమరావతి : ఇవాళ సీఎం జగన్… కరోనా మహమ్మారి కట్టడిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ సన్నద్ధత పై సమీక్ష చేపట్టారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడగించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కట్టడి ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఏపీలో మరో పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు వరకు కర్ఫ్యూ ఉండనుంది. ఇక కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. అలాగే… థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచనలు చేశారు సీఎం జగన్. పోలీస్ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలన్నారు.