శ్రీలంకలో ఇంధన సంక్షోభం.. ఇబ్బందుల్లో వాహనదారులు!

-

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. 22 బిలియన్ల ప్రజలు నివసిస్తున్న ఈ దేశంలో నిత్యావసరాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా శ్రీలంకకు ఇంధన సంక్షోభం కూడా ఏర్పడింది. ఇంధనాల కొరత వల్ల రేషన్ విధానంలో క్యూలో పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం వేచి ఉంటున్నారు. దాదాపు రెండు, మూడు రోజులపాటు క్యూలో నిలబడి ఉంటున్నామని వాహనదారులు చెబుతున్నారు. అయినా పెట్రోల్ దొరకుతుందని నమ్మకం లేదన్నారు. ఇంధన సంక్షోభం కారణంగా శ్రీలంక ప్రభుత్వం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. వారం రోజులపాటు స్కూళ్లను మూసివేశారు.

శ్రీలంక-పెట్రోల్ బంక్
శ్రీలంక-పెట్రోల్ బంక్

దేశంలోని ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నేటి నుంచి వారం రోజులపాటు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ క్లాసులకు ఆటంకం కలగకుండా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ కోతలు విధించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news