దేశవ్యాప్తంగా అనేక చైతన్య విద్యాసంస్థలను నెలకొల్పి వైద్యసేవలను అందిస్తున్న ఘనుడు శ్రీ బి ఎస్ రావు తాజాగా కన్నుమూశారు. ఈయన పూర్తి పేరు బొప్పమ సత్యనారాయణ రావు.. 1986 వ సంవత్సరంలో విజయవాడ అని పిలువబడుతున్న బెజవాడ లో మొట్టమొదటిగా బాలికల కాలేజీ ను స్థాపించడం జరిగింది. ఆ ఒక్క కాలేజ్ తో తన వైద్యసేవను ప్రారంభించిన ఈయన ఈరోజు దేశంలోని దాదాపు అన్ని చిన్న చిన్న టౌన్ లలో ఈయన స్కూల్ కానీ, లేదా కాలేజ్ కానీ లేకుండా లేవు. ఇప్పటి వరకు బి ఎస్ రావు 321 కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్ మరియు 107 CBSE లను నిర్వహించడం జరిగింది. అయితే ఇంతటి వైద్యసేవలను అందిస్తున్న బి ఎస్ రావు కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేక చికిత్సను అందుకుంటున్నారు.
కానీ దురదృష్టవశాత్తూ ఈ మధ్యనే ఇంట్లోనే బాత్ రూమ్ లో కాలు జారీ పడి.. ఆరోగ్యం మరింత క్షీణించి హైద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు. రేపు విజయవాడలోని ఆయన నివాసంలో అంత్యక్రియలు జరగనున్నాయి.