మోదీ ప్రభుత్వం UCC బిల్లు తీస్తే మేము చీరలు కట్టుకుంటాము : AIUDF లీడర్ అజ్మల్

-

గత రెండు వారాల నుండి దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఒక అంశం ఏమిటంటే UCC బిల్లు. అతి త్వరలో పార్లమెంట్ లో జరగనున్న వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ విషయం ప్రకటించిన రోజు నుండి కొన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా అస్సాం లోని AIUDF నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్ స్పందించారు. ఈయన ధుభ్రి లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ ఈ వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెడితే మేము మా జీవనానికి పూర్తి విరుద్ధంగా మార్పులు చేసుకోవాల్సి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ బిల్లు వస్తే మేమంతా చీరలు కట్టుకుని తిరుగుతామన్నారు, అంతే కాకుండా మాంసాహారం కూడా తినడం మానేస్తామని కఠిన వ్యాఖ్యలు చేశాడు.

ఈ రోజు అజ్మల్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ? అలాగే కేంద్రం ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని బిల్లు విషయంలో వెనక్కు తగ్గుతుందా అన్నది తెలియాలంటే సభలు జరిగే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news