శ్రీహరి కోట ‘షార్’ లో కరోనా కల్లోలం.. వరసగా కోవిడ్ బారిన పడుతున్న సిబ్బంది.

-

ఆంధ్ర ప్రదేశ్ నెల్లూర్ జిల్లాలోని శ్రీహరి కోట సతీస్ దావన్ స్పెస్ సెంటర్ (షార్) లో కరోనా కల్లోలం రేపుతోంది. వరసగా సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే 200కు పైగా కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న 142 మందికి కరోనా పాజిటివ్ రాగా.. నేడు 91 మందికి కరోనా సోకింది. అయితే ఇటీవల సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లి వస్తున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వరసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే షార్ లో ప్రస్తుతం 50 శాతం సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇలాగే కరోనా కేసులు పెరిగితే.. భవిష్యత్తులో జరిగే అంతరిక్ష కార్యక్రమాలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

నిన్న ఏపీలో మొత్తం 6996 మందికి కరోనా సోకింది. నలుగురు వ్యక్తులు మరణించారు. సంక్రాంతి తర్వాత ఒక్కసారిగా కరోనా పాజిటివ్ వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 36108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news