అఘోర పాత్ర‌లో బాల‌య్య విజృంభించాడు : శ్రీకాంత్

ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌లు చేసిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య మొద‌టి సారి ఓ వినూత్న పాత్ర‌లో అఘోర‌గా క‌నిపించ‌బోతున్నారు. బాల‌య్య బోయ‌పాటి కాంబోలో వ‌స్తున్న అఖండ సినిమాలో బాల‌య్య ఈ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాతో మొద‌టిసారి శ్రీకాంత్ విల‌న్ గా ప‌రిచ‌యం అవుతున్నారు కూడా. కాగా తాజాగా శ్రీకాంత్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాల‌య్య అఘెర పాత్ర‌ను ద‌ర్శ‌కుడు బోయ‌పాటి అద్భుతంగా డిజైన్ చేశార‌ని చెప్పారు. సినిమాలో బాల‌య్య డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయ‌ని అన్నారు. అంతే కాకుండా బాల‌య్య అఘోర పాత్ర‌లో విజృంభించారంటూ శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

srikanth comments on balayya akhanda
srikanth comments on balayya akhanda

బాల‌య్య యాక్టింగ్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుందంటూ శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. క‌థ క‌థ‌నాలు పాట‌ల ప‌రంగా బాల‌య్య కెరీర్ లో ఈ సినిమా హైలెట్ నిలుస్తుంద‌ని శ్రీకాంత్ అన్నారు. అదేవిధంగా ఈ సినిమాలో బాల‌య్య‌తో న‌టించ‌డం త‌న అదృష్ట‌మ‌ని…ఈ సినిమాతో త‌న‌కు కూడా మంచి పేరు వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్టు శ్రీకాంత్ చెప్పారు. ఇక ఇప్ప‌టికే అఖండ‌పై భారీ అంచ‌నాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ చేసిన కామెంట్స్ తో ఆ అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.