వీర జవాన్లకే పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు… తెలంగాణ సర్కారుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

తెలంగాణలో ప్రజల సమస్యలపై మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తున్నారు. రైతుల సమస్యలపై ట్విట్టర్ వేదికగా గళమెత్తుతున్నారు. ఇటీవల రైతుల సమస్యలపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ఇరు పార్టీల వైఖరి వల్లే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని గతంలో విమర్శించారు.

తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. వీర జవాన్ల ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని.. ఇక రైతులకు ఏం ఇస్తుందన్న రీతిలో ప్రవీణ్ కుమార్ సర్కార్ పై ఫైరయ్యారు. ఆయన ట్విట్లర్ లో స్పందిస్తూ..గత జూన్ లో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన అందరు వీర జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి ₹10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి నేటికి 17 నెలలైతుంది. ఒక కీ.శే. కల్నల్ సంతోష్ గారి కుటుంబానికి తప్ప మిగతా 19 మందికి ఇంతవరకు ఏలాంటి సహాయం అందలేదు. 19 మంది వీరజవాన్లకే ఈ పరిస్థితి ఉంటే, మరి ఇటీవలే ప్రకటించిన 700 అమరులైన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందడానికి ఇక ఎన్ని యుగాలు పడుతుందో…! అంటూ ప్రభుత్వానికి చురకలు అంటించారు.