శ్రీలంక క్రికెట్ కు బ్యాడ్ న్యూస్ … హాసరంగా లేకుండానే లీగ్ మ్యాచ్ లు !

-

ఇటీవల లంక ప్రీమియర్ లీగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో హాసారంగా ఒక మ్యాచ్ లో గాయపడడంతో ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. అయితే మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం వనిందు హాసరంగా గాయం తీవ్రంగా మారిందని, త్వరలో జరగనున్న ఆసియా కప్ తొలి లీగ్ మ్యాచ్ లకు దాదాపుగా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ లో అల్ రౌండర్ గా గుర్తింపు సాధించిన హాసారంగా లీగ్ మ్యాచ్ లకు లేకపోవడం చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. తనదైన స్పిన్ మాయతో ఎంతటి బ్యాట్స్మన్ ను అయినా తన బుట్టలో వేసుకోగలడు. ఇక పేస్ బౌలర్ దుష్మన్త్ చమీరా సైతం గాయం కారణంగా ఆసియా కప్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇక వీరిద్దరూ కాకుండా కుశల పెరీరా మరియు ఆవిష్క పెర్నాండో లకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో శ్రీలంక క్రికెట్ యాజమాన్యం తలలు పట్టుకుంది.

వీరిద్దరినీ ప్రస్తుతానికి అబ్ జర్వేషన్ లో పెట్టారు. ఏమైనా కోలుకుంటేనే ఆసియా కప్ బరిలో ఉంటారు .. లేదా ప్రత్యామ్నాయం చూసుకోవలసిందే.

Read more RELATED
Recommended to you

Latest news