మాజీమంత్రి నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు.. పాదయాత్రలో అతని వ్యవహారం హింసకు ప్రేరేపిస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిథులు. ఈ మేరకు ఏపీలోని పలు స్టేషన్‌లకు ఫిర్యాదులు అందాయి. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రతినిథులు కంప్లైంట్ చేశారు. హింసను ప్రేరేపించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. అయితే లోకేష్ తాజా వ్యవహారం అతన్ని చిక్కుల్లోకి నెట్టే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా లోకేష్ చేస్తున్న ప్రసంగాలు… ప్రకటనలు.. హెచ్చరికలు వివాదాస్పదంగా మారుతున్నాయి.మరికొందరైతే ఈ వ్యవహారం లోకేష్‌ని చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్లకు అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తాం కాబట్టి మీరు పోరాడండి.. కొట్లాడండి అంటూ తెలుగుదేశం కార్యకర్తలకు లోకేష్ హింసను నూరిపోస్తున్నారు. దీని పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
ఒక రాజకీయనాయకుడై ఉండి కార్యకర్తలను హింసవైపు నడిపిస్తారా ?అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో లోకేష్ వలన శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరు బాధ్యులు ? ఇదేనా నాయకుడి తీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయన తీరుతో కార్యకర్తలు రెచ్చిపోయి ప్రభుత్వం మీద, అధికారుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలమీద దాడులకు దిగితే ఎవరు నిలువరిస్తారు ? ఇలా హింసను ప్రేరేపించే లోకేష్ మీద , పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు, రాష్ర్ట అధ్యక్షులు అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు ఆనాడు రెచ్చగొట్టినందునే తంబళ్లపల్లె, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని, ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారని దీనికి టిడిపి నాయకత్వమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సమాజంలో శాంతిభద్రతలను ప్రశ్నార్ధకంలో పడేసేలా లోకేష్ వాఖ్యలు ఉన్నాయని,అలాంటి ప్రకటనలు చేస్తున్న లోకేష్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్‌పై ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.శాంతియుత వాతావరణంలో నాయకుడి పాదయాత్ర ఉండాలని,అయితే లోకేష్ వ్యవహారం అందుకు విరుద్ధంగా ఉందని వారు ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి పరిణామాలను ఆదిలోనే ఆణచివేయాల్సిన అవసరం ఉందని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కోరుతున్నారు.