లక్నో లో వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక మరియు ఆస్ట్రేలియా లు తలపడుతున్నాయి. శ్రీలంక నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా రెండు కీలక వికెట్ లను కోల్పోయింది. మొదటగా డేంజరస్ డేవిడ్ వార్నర్ (11) ను లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మధుశంక అద్భుతమైన బంతితో ఎల్బీడబ్ల్యు గా అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ లోనే మళ్ళీ మధుశంక మరో పవర్ ఫుల్ బంతితో అనుభవజ్ఞుడైన స్మిత్ ను ఎల్బీడబ్ల్యు గా అవుట్ చేసి శ్రీలంకకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. దీనితో ఆస్ట్రేలియా కేవలం నాలుగు ఓవర్ లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంకా 186 పరుగులు చేయాల్సి ఉండగా మరో రెండు వికెట్లు కోల్పోతే నిన్న ఇంగ్లాండ్ లాగా ఆస్ట్రేలియా కు ఓటమి తప్పక పోవచ్చు. శ్రీలంక కు స్పిన్ బాగుండడంతో మ్యాచ్ గెలిచే అవకాశాలు వీరికే ఎక్కువగా ఉన్నాయి.
వెంట వెంటనే మరో రెండు వికెట్లు తీయడానికి ప్రయత్నాలు చేయాలి లేదంటే మ్యాచ్ ను లాగేసుకుని ప్రమాదం ఉంది.