తిరుమల శ్రీవారి నుంచి ఉత్పత్తులు ఇక మనకు ప్రతీ ఇంటికి చేరుతున్నాయి. స్వచ్ఛమైన గో ఆధారిత ఉత్పత్తులను అందించడానికి టీటీడీ రెడీ అయింది. ఈ మేరకు పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల నుంచి లభించే సహజ పథార్థాల నుంచి సౌందర్య ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే ఆలోచనలో ఉన్నారు. సబ్బులు, అగరబత్తిలు, క్రిమిసంహారకాలు, ఫేస్ క్రీములు, హెయిల్ ఆల్స్ వంటి తయారు చేయాలని భావిస్తున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల ఉంది. ఇక్కడి నుంచి ఇప్పటికే రెండు రాష్ట్రాలలోని ఆలయాలకు పాలు, టీటీడీ ఉద్యానవనాలు, తోటలకు ఎరువులను సరఫరా చేస్తున్నారు. గోవుల నుంచి లభించే ‘పంచగవ్య’ ఉత్పత్తులు అంటే… పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం నుంచి కొత్త వస్తువులను తయారు చేయడానికి రెడీ అయి… ఒక కమిటీని కూడా వేయడానికి సిద్దమయ్యారు.
సహజ ఉత్పత్తులు కావడంతో ప్రజలు వీటిని ఆదరించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు దీనికి సంబంధించి గుజరాత్ లోని ‘బన్సీ గిర్ గోశాల’తో కూడా మాట్లాడుతున్నారు. ఆవు పాలు, పెరుగు, మూత్రం, పేడలో ఉంటే సహజ ఔషధాల నుంచి హెయిర్ ఆయిల్, ఫేస్ పౌడర్లు, ఫేషియల్ క్రీములు, మసాజ్ ఆయిల్స్ సహా తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దీనితో టీటీడీకి ఆదాయం పెరగనుంది. కొత్త ఉపాధి కూడా లభిస్తుంది.