ఒకే కుటుంబంలో రెండు పార్టీలు..కోమటి రెడ్డి బ్రదర్స్ వ్యూహం ఇదేనా ?

-

తెలంగాణ కాంగ్రెస్ లో పాలిటిక్స్ అన్నీ డిఫరెంట్ గా వుంటాయి. బయటకు అంతా.. భాయి..భాయి అంటారు. కానీ.. ఎవరి రాజకీయం వాళ్లదే. పక్కనే ఉన్నట్టే ఉంటారు..కానీ మద్దతు ఇంకొకరికి వెళ్తుంది. గడచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో ఇలాంటి పాలిటిక్స్ క్లియర్‌ గా కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న వారి ఇంట్లో పంచాయితీ మరీ గమ్మత్తుగా ఉంటుంది. చూసే వాళ్లని ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఓ బ్రాండ్. కానీ, ఇప్పుడు ఈ ఇద్దరూ చెరో దారి అన్నట్టు ఉంటున్నారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ గా ప్రయత్నం చేస్తుంటే, రాజగోపాల్ రెడ్డి తిరుపతిలో నేనైతే బీజేపీ కి వెళ్తా అంటూ కామెంట్స్ చేశారు. సోదరుడి పీసీసీ చీఫ్‌ ప్రయత్నాలు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో… ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా? లేక అన్నో పార్టీ…తమ్ముడు ఇంకో పార్టీ అనే వ్యూహం ఎంచుకున్నారా అనే టాక్ నడుస్తోంది.

ఇప్పటికి కూడా ఇద్దరూ చెరోదారి అనే రీతిలోనే వ్యవహారం నడిపిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తా అని ఇటీవలే ప్రకటించారు. అయితే పోలీసులు అనుమతి 25 మందికే ఇవ్వడంతో… పాదయాత్ర వాయిదా వేసుకున్నారట. పాదయాత్ర పై కూడా రాజగోపాల్ రెడ్డి మాటైనా మాట్లాడలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేస్తే రాజగోపాల్ వచ్చే వారో.. లేదో అని టాక్ కూడా యాత్ర కు ముందే స్టార్ట్ అయ్యింది.

రాజకీయాలు ఎప్పుడూ అనూహ్యమే.. ఎవరి ఫ్యూచర్‌ వాళ్లదే. దాన్ని సాధించుకోవటంలో భాగంగా ఎత్తుగడ వాళ్లదే. ఇది క్లియర్‌. చూడ్డానికి అన్నదమ్ముల దారులు వేరు కావటం, అన్నకి ఓ అజెండా… తమ్ముడికి మరో అజెండా ఉండటం, ఇద్దరి జెండాలు వేరు కావటంలో తప్పు లేదు. కానీ కార్యకర్తలకు, సామాన్య ప్రజానీకానికి ఇదంతా చిత్రంగా కనిపించటం సహజమే.

 

Read more RELATED
Recommended to you

Latest news