మహేష్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌..ఉగాదికి SSMB28 ఫస్ట్ లుక్?

-

ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సాంగ్‌ను కంపోజ్ చేయబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్. అయితే ఆ సాంగ్ ఏంటనేది క్లారిటీ ఇవ్వకపోయినా.. అది ఐటెం సాంగ్ అయి ఉంటుందనే టాక్ ఊపందుకుంది.

చాలా రోజులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తోంది. కాగా, త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB28 చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. ఉగాది సందర్భంగా మార్చి 22న మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news