ఇండియన్ బ్యాంక్‌లో 128 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు… ఇలా అప్లై చేసేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తమిళనాడు రాష్ట్రం లోని చెన్నై కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఇండియన్ బ్యాంక్ లో మొత్తం 128 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు వున్నాయి.

ఇక మనం పోస్టుల వివరాలని చూస్తే… తమిళనాడు రాష్ట్రం లోని చెన్నై కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ లో ఐటీ/కంప్యూటర్‌ ఆఫీసర్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఈ పోస్టులని భర్తీ చేయనున్నారు. ఇక పోస్టుల వివరాలని చూస్తే… ఐటీ/కంప్యూటర్‌ ఆఫీసర్‌ పోస్టులు 23, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు 13, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ పోస్టులు 7, ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 20, ఫారెక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 10, ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు 50, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ పోస్టులు 5 వున్నాయి. వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం ఇవన్నీ అధికారిక నోటిఫికేషన్‌ లో చూడచ్చు. https://www.indianbank.in/career/#! లో పూర్తి వివరాలు చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news